బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విఫ్ పాడి కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వరకు కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గవర్నర్ నుంచి మొదలుకుని తాజాగా యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ పైనా కౌశిక్‌రెడ్డి(Kaushik Reddy) వ్యవహరించిన తీరుతో పార్టీ గ్రాఫ్ పడిపోతుందనే ఆలోచనలో అధిష్టానం పడినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్(Youtube Channels)పై ఆదివారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్‌లో ప్రచారం చేసిన వాయిస్ తనది కాదని అన్నారు. తప్పుడు ప్రచారం చేసి తనను మానసిక వేదనకు గురిచేసిన యూట్యూబ్ ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also:
1. రాహుల్ గాంధీతో జూపల్లి, పొంగులేటి భేటీ ఖరారు
2. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat