సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్(Secunderabad)-తిరుపతి(Tirupati) వందేభారత్ రైలును ప్రధాని మోదీ(PM Modi) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మోదీ పక్కన గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న మోదీ.. నేరుగా రోడ్డు మార్గంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకున్న మోదీ(PM Modi)కి గవర్నర్ తమిళిసై(Governor Tamilisai), కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, నేతలు స్వాగతం పలికారు. దేశ చరిత్రలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు.
Read Also: ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ లో వేడెక్కిన రాజకీయాలు
Follow us on: Google News, Koo, Twitter