తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్(Modi Telangana Tour) ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన సందర్భంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు 8న హైదరాబాద్‌లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా పడింది.
Read Also:
1. టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat