ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభ(Janagarjana Sabha)లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చచ్చిపోతుందని సోనియాకు కూడా తెలుసున్నారు. యువకుల బలిదానాలు మరిన్ని జరగకూడదని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. మాయమాటలు చెప్పి కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఇచ్చిన వాగ్ధానాల్లో ఏ ఒక్కటి ఆయన అమలు చేయలేదని.. తెలంగాణ వచ్చాక 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో, 2018లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గాలికొదిలేశారని పొంగులేటి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన అన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి లేదని, వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేసేలా కృషి చేద్దామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) పిలుపునిచ్చారు. విజయవంతంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కను ప్రశంసించారు.
Read Also:
1. ఖమ్మం సభపై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat