తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ వివాదం హైదరాబాద్‌లోనూ తలెత్తడంతో మొదటిసారి ఈ వివాదంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లిం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. హిందూ మహిళల తరహాలోనే ముస్లిం మహిళలు కూడా దుస్తులు ధరించాలని సూచించారు. పొట్టి దుస్తులు ధరించడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి కళాశాలలో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినులు హిజాబ్(Hijab) ధరించి వెళ్లారు. దీంతో కళాశాల నిర్వాహకులు ఆ విద్యార్థినులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే కళాశాల నిర్వాహకులు మాత్రం హిజాబ్ వేసుకొని వస్తే ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు వీళ్లేదని తేల్చిచెప్పారు. చివరకు చేసేదేమి లేక హిజాబ్ తొలగించి పరీక్ష రాశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు విషయం మంత్రి మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మంత్రి మహమూద్ అలీ(Mahmood Ali) స్పందించి ఈ విషయంపై ఇలా వ్యాఖ్యానించారు.
Mahmood Ali | తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు
-