దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) తనకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ ని పెంచాలని డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు ను అందజేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తాను చేస్తున్న కంప్లైంట్స్ కి ఇబ్బందులు కలుగుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వారు తెలిపారు. ఇదే విషయంలో గతేడాది ఏప్రిల్ లో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి కి దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అదే విషయంపై డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar) కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని.. వారు అందుబాటులో లేని కారణంగా అడిషనల్ డీజీపీ, లా అండ్ ఆర్డర్ కు ఇచ్చినట్లు వివరించారు. గడిచిన సంవత్సర కాలం నుండి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగితే సమాధానం రాలేదన్నారు.
2014 నుండి తెలంగాణ పోలీసు శాఖ ఎన్ని వాహనాలను కొనుగోలు చేసింది.. వాటి పై పెడుతున్న నెలవారీ ఖర్చు ఎంత అని ప్రశ్నించినట్లు తెలిపారు. 11 వేల వాహనాలను కొనుగోలు చేసినా జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో రేప్ లు ఎలా జరుగుతున్నాయని రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.
Read Also: డెవలప్మెంట్ అంటే.. ఫ్యామిలీ డెవలప్ అవ్వడం కాదు: గవర్నర్
Follow us on: Google News, Koo, Twitter