సీఎం కేసీఆర్(KCR) టిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడంతో తెలంగాణలో ఎన్నికల మరింత పెరిగింది. ఆయన విడుదల చేసిన లిస్టు కొందరు ఆశావహులను నిరాశపరచినప్పటికీ, టికెట్ దక్కిన వారు సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు కేసిఆర్ ప్రకటించారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్(Gajwel) తో పాటు ఈసారి కామారెడ్డి(Kamareddy) లో కూడా ఆయన పోటీ చేయనున్నట్లు తెలిపారు.
కేసీఆర్(KCR) నిర్ణయం పై సర్వత్రా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఆయన రెండు నియోజకవర్గాల్లో ఎందుకు పోటీ చేయనున్నారు అనే ప్రశ్న మొదలైంది. కాగా, రెండు చోట్ల పోటీపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. నేతల విజ్ఞప్తితోనే గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 105 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, 2014లో గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా, మెదక్ పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగారు. అప్పుడు రెండు చోట్ల గెలిచిన కేసీఆర్.. మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.