తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తొలిసారిగా స్పందించారు. కేటీఆర్(KTR) వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చారు. అహంకారంగా మాట్లాడితే జైలులో చిప్పకూడు తింటాడని హెచ్చరించారు.
“గత ప్రభుత్వంలో భార్యభర్తల ఫోన్ కాల్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. కొంతమంది ఫోన్లు విన్నామని కేటీఆర్ అంటున్నారు.. మంది సంసారాల్లో వేలు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది. కేటీఆర్ తాగుబోతులా బరితెగించి మాట్లాడుతున్నారు. ఒకట్రెండు ఫోన్ల సంభాషణ విన్నాం.. వింటే ఏమవుతుందని సిగ్గు లేకుండా అంటున్నారు. అలా ఫోన్ సంభాషణలు వింటే చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది చట్టప్రకారం చర్యలు ఉంటాయి. ఇలాంటి పొరపాట్లు చేయ్యొద్దని చెప్పినా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు చేసిన తప్పులకు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు” అని రేవంత్ తెలిపారు.
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డిసిపి రాధా కిషన్ రావులను అరెస్ట్ చేశారు.