Prathinidhi 2 Teaser | ఓటేయండి లేదంటే చచ్చిపోండి.. దుమ్మురేపుతున్న ‘ప్రతినిధి2’ టీజర్..

-

Prathinidhi 2 Teaser | నారా రోహిత్ హీరోగా ప్రస్తుతం ‘ప్రతినిధి2’ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్‌ మూవీ ‘ప్రతినిధి’ సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా మూవీ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా టీజర్‌ను రూపొందించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీసినట్లు అర్థమవుతోంది.

- Advertisement -

“జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలోనే బతుకుతాం. పైన కూర్చొని ఎన్ని అయినా చెబుతారు నీతులు.. మేము ఖర్చు పెట్టింది ఎవడిస్తాడు.. వాడా, వాడమ్మా మొగుడా” అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓ మంత్రిని హీరో రోహిత్(Nara Rohith) ఇంటర్వ్యూ చేస్తూ మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్ అని అడిగితే.. సుమారు రూ.5లక్షల కోట్లు ఉండొచ్చు అంటాడు. మరి ఎలా తీరుస్తారు అంటే అభివృద్ధి చేసి అని మంత్రి చెప్పగా.. అది ఎక్కడుంది సార్ అంటూ కౌంటర్ ఇస్తాడు.

ఇక టీజర్(Prathinidhi 2 Teaser) చివరిలో “ఇప్పటికైనా కళ్లు తెరవండి.. ఒళ్లు విరిచి బయటికొచ్చి ఓటేయండి.. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి.. అదీ కుదరకపోతే చచ్చిపోండి” అంటూ రోహిత్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఏప్రిల్‌ నెలలో మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...