తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ రాత్రి రాజ్ భవన్‌లో ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క చేత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు స్వీకరించారు. సీఎం ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంను రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రవేశపెట్టగా.. భట్టి విక్రమార్క(Bharti Vikramarka), దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఇతర ఎమ్మెల్యేలు బలపర్చారు. ఈ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపించారు. కాగా ఫలితాల్లో కాంగ్రెస్‌కు సాధారణ మెజార్టీ కంటే ఐదు సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అందుకే ముందు జాగ్రత్తగా హుటాహుటిన సీఎం అభ్యర్థిని ఎంపిక చేశారు.