బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్(BRS), టెన్త్ విద్యార్థుల జీవితాలతో బీజేపీ రాజకీయం చేస్తున్నా్యని మండిపడ్డారు. టెన్త్ విద్యార్థుల జీవితాలతో బండి సంజయ్ చెలగాటమాడటం ఘోరమైన తప్పు.. ఘోరమైన నేరం అందుకే బండి సంజయ్(Bandi Sanjay) పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత బీజేపీ(BJP) వాళ్లకు లేదన్నారు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను, వారి తల్లి దండ్రులు పేపర్ లీకేజి వల్ల ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందని అందులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వరంగల్‌లో హిందీ పేపర్ లీక్ కావడం.. ప్రశ్నపత్రాన్ని దాదాపు రెండువందల మందికి షేర్ చేశారని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రతో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆందోళనకు గురి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ ఘటన పై వరంగల్ CP రంగనాథ్‌ను అభినందిస్తున్నాను. బండి సంజయ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ(RS Praveen Kumar)డిమాండ్ చేశారు.
Read Also: BJP శ్రేణులకు జైలు నుంచి బండి సంజయ్ లేఖ
Follow us on: Google News, Koo, Twitter


 
                                    