బీఆర్ఎస్ బహిష్క్రృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ నెలాఖరున పొంగులేటి(Ponguleti Srinivas Reddy), జూపల్లి(Jupally Krishna Rao)తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్(Congress)లో చేరబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 22న అమెరికా నుంచి రాహుల్(Rahul Gandhi) ఢిల్లీకి రానున్నారు. ఆయన వచ్చాక ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి పొంగులేటి చేరబోతున్నట్లు కాంగ్రెస్ కీలక నేతలు తెలిపారు. మరోవైపు నాగర్ కర్నూల్ వేదికగా జరిగే సభలో జూపల్లి, దామోదర్ రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారని పేర్కొన్నారు. రాహుల్ అమెరికా పర్యటనలో ఉండడంతోనే వీరి చేరిక ఆలస్యం అయిందని చెబుతున్నారు.
మరోవైపు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడంతో అంగీకరించిన గురున్నాథ్ ఈనెల 18న హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. అటు ఇప్పటికే సీఎం కేసీఆర్ సన్నిహితుడు శ్రీహరిరావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ ఇంకా పూర్తిగా మొదలవ్వకుండానే చేరికలు ఈ రేంజ్‌లో ఉన్నాయంటే.. ఎన్నికలు సమీపిస్తే మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ చేరికలో కాంగ్రెస్(Congress) పార్టీకి తెలంగాణలో మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also:
1. తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు
2. దేశానికి రెండో రాజధానిగా తెలంగాణ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat