ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) వినియోగదారుల నుంచి కొత్త ఛార్జీల వసూలకు సిద్ధమైంది. కార్ట్ విలువతో సంబంధం లేకుండా ఇక నుంచి ప్రతి ఆర్డర్ పై రూ.2చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజు వసూలు చేయనుంది. ప్రస్తుతానికి ఎంపిక చేసి ప్రాంతాల్లో ఫుడ్ ఆర్డర్స్ కు మాత్రమే ఈ ఫీజును వసూలు చేస్తోంది. ప్రెజెంట్ బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే ఫుడ్ డెలివరీలకు ఈ అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
భవిష్యత్ లో ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లకూ ఈ ఫీజును వసూలు చేయననున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీలు తగ్గడంతో పాటు కొత్త ఆదాయం సమకూర్చునేందుకు ఈ ఫీజు ఉపయోగపడుతుందని స్విగ్గీ(Swiggy) ప్రతినిధి ఒకరు తెలిపారు. స్విగ్గీ యాప్ వాడుతున్నందుకు ఈ ఫ్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం రూ.2 అనేది తక్కువగా ఉన్నప్పటికీ.. రోజుకు 15లక్షల ఫుడ్ డెలివరీల పరంగా చూస్తే ఇది భారీగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: ఫ్రైడ్ ఫుడ్, లాగించేస్తున్నారా? అధ్యయనంలో ఏం తేలింది?
Follow us on: Google News, Koo, Twitter