చంద్రబాబు దేశానికి ఎంతో సేవ చేశారు: తలసాని

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) మరోసారి స్పందించారు. ఉమ్మడి ఏపీతో పాటు దేశానికి ఎంతో సేవ చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు(Chandrababu) విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని వివరించారు.

- Advertisement -

తన రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైందనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు రాజీకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత సీఎం ఎన్టీఆర్(NTR) అని తెలిపారు. తన గుండెలో ఆయనకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేటలో కానీ, సనత్ నగర్‌లో కానీ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమన్నారు. సనత్ నగర్ ఏరియాలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవంలో పాల్గొన్న తలసాని(Talasani Srinivas Yadav) ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Read Also: ప్రచారంలో ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mamta Kulkarni | 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?

మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన...

Sandhya Theatre Case | సంధ్య థియేటర్ ఘటన.. ముగ్గురు అరెస్ట్

Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్‌టీసీ...