జూనియర్ పంచాయతీ కార్యదర్శు(JPS)లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. జేపీఎస్‌లు అందరినీ పర్మినెంట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను(Sandeep Kumar Sultania) సీఎం ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును సమీక్ష చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండనున్నారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయనున్నారు.
Read Also: ‘సీఎం కేసీఆర్‌ను కోసి కారం పెట్టినా తప్పులేదు’
Follow us on: Google News, Koo, Twitter