Telangana | మైనార్టీలను ఆర్థికంగా బలోపేతమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నూరు శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు అందజేసేందుకు ఆదివారం స్కీంకు సంబంధించిన జీవోను జారీ చేసింది. గత నెల బీసీలకు లక్ష రూపాయల పథకం తీసుకొచ్చిన ప్రభుత్వం, తాజాగా మైనార్టీల కోసం ‘లక్ష స్కీం’ పథకాన్ని తీసుకొచ్చింది.
అర్హులైన క్రిస్టియన్లకు.. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు చెందినవారికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో లక్షసాయం అందజేయనున్నారు. ఇప్పటికే దళితులకు దళిత బంధు పథకంతో పది లక్షల రూపాయలు అందజేస్తుంది. అయితే మైనార్టీలు గుర్రుగా ఉండడంతో వారికి సైతం అందజేసేందుకు కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.