Bandi Sai Bhageerath |బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమారుడు భగీరథ్‌కు హైకోర్టు నుంచి ఊరట దక్కింది. తోటి విద్యార్థిని చితకబాదాడన్న నేరారోపణలపై సస్పెన్షన్‌లో ఉన్న భగీరథ్‌ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు క్లాసులకు అనుమతించాలని హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మహీంద్రా యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భగీరథ్తన స్నేహితునితో కలిసి జనవరిలో తోటి విద్యార్థిని చితకబాదిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్అయ్యింది.
ఈ వీడియోను చూసిన వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 341, 323, 504, 506 సెక్షన్ల ప్రకారం భగీరథ్(Bandi Sai Bhageerath) అతని స్నేహితునిపై కేసులు నమోదు చేశారు. దీనిపై భగీరథ్హైకోర్టుకు వెళ్లాడు. తన వివరణ తీసుకోకుండానే వర్సిటీ వర్గాలు సస్పెండ్చేశాయని, ఫలితంగా తరగతులకు హాజరు కాలేకపోతున్నానని పిటీషన్‌దాఖలు చేశాడు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు భగీరథ్ తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది.
Read Also: ఇకపై భయమంటే ఏంటో ప్రభుత్వానికి చూపిస్తా: బండి సంజయ్
Follow us on: Google News, Koo, Twitter