Telangana police good news for women and children: రాష్ట్రంలో మహిళలు, పిల్లలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రణాళికను రూపొందించి ఆచరణలోకి తీసుకువచ్చింది. ఇంటి గ్రేటెడ్ సపోర్టు సెంటర్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్ (భరోసా) కేంద్రానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తుంది. అర ఎకరం స్థల విస్తీర్ణంలో ఈ భరోసా భవానాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖ మంత్రులతో కలిసి వారంరోజుల్లో భూమి పూజ చేయనున్నాట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘వరంగల్, రంగంపేటలో రూ.2.50 కోట్లతో ఈ భరోసా భవనం నిర్మాణం చేపట్టనున్నారు. లైంగిక దాడి, పొక్సో చట్టం పరిధిలోకి వచ్చే బాధితులకు సత్వర స్వాంతన, సహాయం అందించడానికి ఈ భరోసా సెంటర్లు ఉపయోగపడతాయి.’’ అని తెలంగాణ పోలీసులు (Telangana police) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మహిళలు మరియు బాలల భద్రతకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వరంగల్, రంగంపేటలో రూ.2.50 కోట్లతో భరోసా భవనం నిర్మాణం చేపట్టనున్నారు.
లైంగిక దాడి, పొక్సో చట్టం పరిధిలోకి వచ్చే బాధితులకు సత్వర స్వాంతన, సహాయం అందించడానికి ఈ భరోసా సెంటర్లు ఉపయోగపడతాయి. #TelanganaBharosaCenters pic.twitter.com/EwP4bbHRLc
— Telangana State Police (@TelanganaCOPs) November 21, 2022