గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు(Group 1 Prelims Exams) రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే.
తిరిగి ఈనెల 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష(Group 1 Prelims Exams) జరపాలని నిర్ణయించిన బోర్డు ఈ మేరకు ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీనిపై 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాని నేపథ్యంలో రెండు నెలలపాటు పరీక్షను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యాలని కోరారు. దీంతో ప్రభుత్వం తరపు వాదనలను ఏకీభవించిన కోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు, వాయిదా పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.