TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకంగా తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న అన్ని పథకాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేలా సభలో చర్చ జరిగేలా నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఇదే సరైన వేదిక అని ప్రధాన ప్రతిపక్షాలు ఈ సమావేశాలు కీలంకగా మారాయి.
దూకుడు మీదున్న కాంగ్రెస్, నెమ్మదైన బీజేపీ కూడా గట్టిగా గళం విప్పాలని ఫిక్స్ అవడంతో అసెంబ్లీ సమావేశాలు(TS Assembly) ఈ సారి మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఈ సభలో ఇటీవల మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. కేవలం మూడ్రోజుల పాటే సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది.