నూతన సచివాలయంలో మొదటిసారి కేబినెట్ భేటీ(TS Cabinet) నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వీఆర్ఏలకు శుభవార్త చెప్పారు. వారిని రెగ్యూలరైజ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వీఆర్ఏలను వివిధ విభాగాల్లో సర్దుబాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇందుకోసం త్వరలోనే విధివిధాలు ప్రకటిస్తామని తెలిపారు. కాగా, గత కొన్నిరోజులుగా తమను రెగ్యూలరైజ్ చేయాలని వీఆర్ఏలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. నూతన సచివాలయంలో మొదటిసారి భేటీ అయిన కేబినెట్ వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.