TS EAMCET Results |లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86శాతం మంది అర్హత సాధించినట్లు సబిత తెలిపారు. ఫలితాల(TS EAMCET Results) కోసం విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్ సైట్ క్లిక్ చేయండి. 1,92,275 మంది ఇంజనీరింగ్ పరీక్ష రాయగా.. 1,06,514 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా.. 65,871 మంది పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. మే 10 నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇక తెలంగాణ విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం సీట్లు రిజర్వ్ చేయగా, మిగిలిన 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు.
Read Also:
1. భవిష్యత్తులో కాంగ్రెస్- బీఆర్ఎస్ కలిసే అవకాశాలున్నాయి: ఈటల
2. వేసవిలో సింపుల్ స్కిన్ కేర్ టిప్స్
Follow us on: Google News, Koo, Twitter