YS Sharmila |టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా సంస్థలో పనిచేసే ఉద్యోగే లీకులు చేయడం తీవ్ర దుమారం రేపింది. తాజాగా.. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కా్ర్, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, అందరూ కుమ్మక్కయ్యే ఈ స్కాం చేశారన్నారు. ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారని, బోర్డ్ మొత్తాన్ని రద్దు చేయాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం టీఎస్ పీఎస్సీలో రిజిస్టర్ చేసుకున్నారన్నారు. బోర్డ్ చైర్మన్‌కి, సెక్రటరీకి వద్ద ఉండే పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీకయ్యాయని ఆమె ప్రశ్నించారు. అంగట్లో సరుకులు అమ్మినట్లు టీఎస్ పీఎస్సీ పేపర్లు అమ్ముతున్నారని షర్మిల మండిపడ్డారు.
Read Also: గ్రూపు-1 ఎగ్జామ్ రద్దు.. కొత్త పరీక్ష తేదీ ఇదే!
Follow us on: Google News