సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మరోసారి టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తండ్రీకొడుకు కొలువులు అమ్ముకోవడమే టార్గెట్ పెట్టుకున్నారని, అందుకే టీఎస్ పీఎస్పీ(TSPSC) ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సిట్‌కు అప్పగించారని కేసీఆర్(KCR), కేటీఆర్(KTR)లను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీ కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ అని దీని ద్వారా మరోసారి తేలిపోయిందన్నారు. అయినవాళ్లకు పదవులు కట్టబెట్టి, కొలువులు అమ్ముకోవడమే టార్గెట్ అని మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ అంటే చట్టబద్ధ సంస్థ అని చెప్పే చిన్నదొర చట్టానికి విరుద్ధంగా పదవులు ఎందుకు కట్టబెట్టినట్టని ప్రశ్నించారు. నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నా, అర్హత, సామర్థ్యం లేని వ్యక్తులను సభ్యులుగా ఎందుకు నియమించినట్టని షర్మిల(YS Sharmila) ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ రెండు నెలలుగా దర్యాప్తు పేరుతో ఊగిసలాడుతోందని మండిపడ్డారు. సభ్యుల నియామకం అక్రమమని హైకోర్టు చెప్పే దాకా ఎందుకు తేల్చలేకపోయారని ఆమె ప్రశ్నించారు.
Read Also:
1. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు
2. వారిపై కేసు ఎత్తివేయండి.. డీజీపీకి కేసీఆర్ సంచలన ఆదేశాలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat