YS Sharmila |తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: షర్మిల

-

YS Sharmila |బీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం గవర్నర్ తమిళిసైతో షర్మిల భేటీ అయ్యారు. ప్రీతి ర్యాంగింగ్‌ అంశంపై గవర్నర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే కనిపించడం లేదని, రాష్ట్రంలో కేసీఆర్(KCR) రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. ఆయన ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని కూడా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

YS Sharmila |ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్‌గా మారిందని, కేసీఆర్ తాలిబాన్‌గా తయారయ్యాడని సీరియస్ కామెంట్స్ చేశారు. వీధి కుక్కలు చిన్నారిని చంపేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు వ్యాఖ్యానించారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...