నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘వాషింగ్ పౌడర్ నిర్మ’ కేసీఆర్‌కు సైతం పనిచేసినట్టు ఉంది. నిర్మాతో నిర్మల్ వేదికగా దొర ముసుగు తొలగింది. బీజేపీతో దోస్తీ బయటపడింది. కారు – కమలం రెండూ ఒక్కటేనన్న తళతళ మెరుపు కేసీఆర్(KCR) మొఖంలో కనపడ్డది. నోరు విప్పితే బీజేపీని తిట్టే కేసీఆర్ దొర.. మోడీ(Modi)ని పల్లెత్తుమాట కూడా అనడం లేదు. బిడ్డ లిక్కర్ స్కాంలో దొరకగానే.. ఢిల్లీకి వెళ్లి రహస్యంగా బీజేపీకి పొర్లు దండాలు పెట్టాడు. కొడుకు రియల్ ఎస్టేట్ మాఫియా బయటపడకుండా బీజేపీ అధిష్టానానికి మోకాళ్లు వంచాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల గురించి అడగవద్దని బీజేపీకి సలాం కొట్టిండు.

- Advertisement -

అవసరానికి తగ్గట్లు వేషాలు మారుస్తూ, జనాలను పిచ్చోళ్ళను చేయడమే BJP, BRS రహస్య అజెండా. నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇన్నాళ్లు బీజేపీతో కేసీఆర్ నడిపిన దోస్తానా ఇదే. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా..? పోస్ట్ పోల్ ఒప్పందమా..? కమలం ముసుగు కప్పుకొని కారులో తిరిగే కేసీఆర్ దొర.. అసలు విషయం బయటపెట్టు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడని బీజేపీ సైతం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు మద్దతు తెలపడమే బీజేపీ రహస్య ఒప్పందమా? బీజేపీ అభ్యర్థులు కేసీఆర్‌కు సప్లయింగ్ కంపెనీలా మారడమే సీక్రెట్ అగ్రీమెంటా? కేసీఆర్‌కు సీట్లు తక్కువ పడితే ఎమ్మెల్యేలను అందించడమే తెర వెనుక ఒప్పందమా? ఏ ఒప్పందం లేకపోతే కేసీఆర్ అవినీతిపై చర్యలు ఏవి? కవిత అరెస్టుపై ఎందుకీ సాగదీత? తక్షణం బీజేపీ నోరు విప్పాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.’’ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

Read Also:
1. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నారు: సీతక్క

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...