బిగ్‌ బాస్‌-2 నుండి ఎలిమినేట్ అయిన కిరిటీ

-

బిగ్‌ బాస్‌-2 హౌజ్ నుంచి నటుడు కిరిటీ ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా కిరిటీ గురించి మరోసారి నేచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చారు. కిరిటీపై నెగిటివ్ టాక్‌ను తొలగించేందుకు బిగ్‌బాస్ అతడిని బోనులో నిలబెట్టడం జరిగింది. దీనిపై కౌశల్ స్పందిస్తూ.. కిరిటీ మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆ రోజు తనపై చేసిన ఆరోపణలు టాస్క్‌లో భాగంగా చేశానంతే గానీ.. ఎవర్నీ బాధ పెట్టేందుకు కాదు.. బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని కౌశల్‌కు కిరిటీ వివరణ ఇచ్చుకున్నారు.

- Advertisement -

కిరిటీ గురించి తనీష్ మాట్లాడుతూ.. “నేను కిరిటీ జాకెట్‌ను చూసి బాగుంది అని అన్నానంతే. వెంటనే అది నాచేతికిచ్చి.. ఇది నీకే.. తీసేస్కో అని ఇచ్చేశాడు. ఇది కిరీటీ అంటే” అని అన్నాడు. మిగతా సభ్యులు సామ్రాట్ రెడ్డి, బాబు గోగినేని కూడా కిరిటీ గురించి పాజిటివ్‌గానే చెప్పారు. కిరిటీ హౌజ్ నుంచి బయటికెళ్తుంటే బిగ్‌బాస్ సభ్యులు కాసింత విచారం వ్యక్తం చేశారు. బాబు గోగినేని మాట్లాడుతూ.. ఓ టాస్క్ సమయంలో పాపం కిరిటీ.. సభ్యులకు ఏం చెప్పుకోలేక, ఏం చేయాలో తోచక బాత్రూమ్‌కు వెళ్లి ఏడ్చాడని చెప్పారు. సభ్యులు మాట్లాడుతుండగా కిరిటీ కంటతడి పెట్టారు.

ఈ సందర్భంగా నానీ మాట్లాడుతూ.. ” మొదటి వారం నుంచి సభ్యులతో బాగున్న కిరిటీ.. రెండో వారంలో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా కౌశల్‌ పట్ల వికృతంగా ప్రవర్తించాడు. అందరితో బాగున్నప్పటికీ ఈ ఒక్క ఎపిసోడ్‌లో అతని ప్రవర్తన కారణంగా ప్రేక్షకులకు దూరమయ్యాడు. నీ గురించి అందరూ మంచిగానే చెబుతున్నారు.. నువ్వు హౌజ్లో ఇలా ఎందుకు ఉండలేకపోయావ్?”అని నాని ప్రశ్నించాడు. దీనికి కిరిటీ స్పందిస్తూ..” నేను హౌజ్‌లో కూడా ఇలాగే ఉన్నాను కదా.. అయినా ఎలిమినేట్ అయ్యా” అని కిరిటీ ఆవేదన వ్యక్తం చేశాడు. కిరిటీ వెళ్తూ.. వెళ్తూ బిగ్ బాస్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్.. టేక్ కేర్ అంటూ చెప్పి బయటికెళ్లిపోయారు.

కాగా.. గీతా మాధురీ, కిరిటీ, గణేష్ నామినేషన్లలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిలో.. గీతా మాధురీ, గణేష్‌లు సేఫ్ జోన్‌లోకి రావడంతో కిరిటీ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...