సోషల్ మీడియాలో మనం చాలా వీడియోలను చూస్తు ఉంటాం. ముఖ్యంగా కొన్ని సాహాసాలకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తాయి, కొన్ని కన్నీరు పెట్టిస్తాయి, కొన్ని జాలి కలిగిస్తాయి, మరికొన్ని భయం ఆందోళన కలిగిస్తాయి. అస్సలు ఇలా ఎలా చేశారా అనిపిస్తుంది అలాంటి వీడియోలు చూస్తే.
కొందరు ప్రాణాలతో చెలగాటమాడుతూ వీడియోలు చేస్తుంటారు. ఇప్పుడు మనం చూసే వీడియోలో వ్యక్తి కూడా అంతే.ఈయన స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు ఎలాంటి ప్లేస్ సెలక్ట్ చేసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.ఎంతో ఎత్తైన వంతెన పై నుంచి స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు సాహసం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇలా కూడా చేస్తారా అంటూ షాక్ అవుతున్నారు అందరూ.
స్కేట్ బోర్డింగ్ ఆడేందుకు చాలా ఎత్తైన వంతెన పైకి చేరుకున్నాడు ఇతను, ఆ పైనుంచి అమాంతం దూకేశాడు. ఇక పారాచూట్ సాయతో కిందకి దిగాడు. దీనిని చూస్తుంటే ఆశ్చర్యం భయం కూడా కలుగుతున్నాయి అందరికి. ఇలాంటివి ఎవరూ ట్రై చేయకండి అని చాలా మంది కోరుతున్నారు. మీరు ఈ వీడియో చూసేయండి.
https://twitter.com/Aqualady6666/status/1415929479067619329
Be Honest,what's Stopping You From Having This Kinda Fun??? pic.twitter.com/aN3YKEPo5G
— Aqualady? ? ? (@Aqualady6666) July 16, 2021