కన్నడ భామ రష్మిక మందన్న వరుస అవకాశాలతో టాలీవుడ్ లో మంచి బిజీగా ఉంది. ఇటు తెలుగు తమిళ్ లో ఆమెకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమె అవకాశాలను చేజిక్కించుకుంటోంది. మిషన్ మజ్ను అనే సినిమాతో పాటు, గుడ్ బోయ్ అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తోంది.
ఇక తన అభిమానులతో కూడా నిత్యం టచ్ లో ఉంటుంది.
తాజాగా తన అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారా కాసేపు ముచ్చటించింది. మీరు స్మోక్ చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా… తనకు స్మోకింగ్ అంటే అసహ్యమని చెప్పింది. ఇక ఎవరైనా స్మోక్ చేసే వారి పక్కన నిలబడాలన్నా తనకు చాలా కష్టం అని చెప్పింది.
మీ భర్త ఎలా ఉండాలనే ప్రశ్నకు సమాధానంగా, అతను మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలని రష్మిక చెప్పింది. హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా నార్మల్ గా ఉండాలని చెప్పింది. ఇక క్యూట్ గా ఉండే రష్మిక సమాధానాలు, ఆమె కోరికలు విని ఆమె అభిమానులు సూపర్ మేడం అంటున్నారు.