గంగపుత్రుల లైఫ్ మార్చేసిన ఆ 11 చేపలు

11 fishes that changed the life of the Gangaputras

0
98

సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఇటీవల కొన్ని చేపలు దొరుకుతున్నాయి. అవి అత్యంత ఖరీదైనవి కావడంతో వారి లైఫ్ సెట్ అవుతుంది. ఏకంగా కోట్ల రూపాయలు పలుకుతున్న చేపలు చూశాం. మరికొన్ని లక్షల ధర పలుకుతున్న చేపలు చూశాం,.తాజాగా ఓ తిమింగలం వాంతి ఏకంగా 2 కోట్లు తెచ్చిపెట్టిందని విన్నాం. అయితే ఇప్పుడు మరో చేప ఓ జాలరి జీవితాన్ని మార్చింది.

పారాడిప్లోని కొంతమంది మత్స్యకారులు ఫిషింగ్ కోసం వెళ్లగా వారికి అరుదైన ఘోల్ చేపలు గేలానికి చిక్కాయి. గంగపుత్రులు చాలా ఆనందించారు. మొత్తం వలలో చూస్తే ఇవి 11 దొరికాయి. వాటిని అక్కడ టేలియా చేపలని పిలుస్తారట. వీటి ద్వారా ఆ మత్స్యకారులు సుమారు రూ. 5.80 లక్షలు సంపాదించారు.

వేటకి వెళితే 20 వేలు లేదా 40 వేలు వస్తుంది అని, కాని ఈసారి 11 చేపలకు 5.80 లక్షలు వచ్చాయి అని ఆనందించారు. ఈ టేలియా చేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని. దీనిని అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు అని తెలియచేశారు.ఈ ఘోల్ చేపలు ఇనుము, అయోడిన్, మెగ్నీషియం, ఫ్లోరైడ్, సెలీనియం కలిగి ఉంటాయి.