ఐపీఎల్ మెగా వేలానికి 1214 మంది క్రికెటర్లు..వేలంలో పాల్గొనని విండీస్ స్టార్

0
111

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. కొత్తగా ల‌క్నో, అహ్మ‌దాబాద్ ఫ్రొచైంజ్ లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు.

ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు వేలానికి రెడీ అని ప్రకటించారు. విండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఈ వేలంలో మొత్తం క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (61 మంది), క్యాప్​డ్ ఇంటర్నేషనల్ (209 మంది), అసోసియేట్ (41 మంది), ఇంతకుముందు సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (143 మంది), గత సీజన్లలో పాల్గొన్న అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (6 మంది), అన్​క్యాప్​డ్ భారత ఆటగాళ్లు (692 మంది), అన్​క్యాప్​డ్ విదేశీ ఆటగాళ్లు (62) మంది తమ పేర్లను మెగావేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు.