Flash: టీమిండియా ఆటగాళ్ల బస్సులో బుల్లెట్ల కలకలం

0
106

టీమిండియా ఆటగాళ్ల బస్సులో బుల్లెట్స్ దొరకడం ఇప్పుడు కలకలం రేపుతోంది. శ్రీలంకతో టీ20 సిరీస్​ ఆడుతున్న టీమ్​ఇండియా వచ్చే నెల నుంచి టెస్టు మ్యాచ్​ల్లో తలపడనుంది. టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మొహాలీ వేదికగా జరగనుంది. అయితే దీనికోసం అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. వారి తనిఖీల్లో ఈ బుల్లెట్ షెల్స్ లభ్యమయ్యాయి.  అసలు ఆ బుల్లెట్ షెల్స్ ఎక్కడివి? బస్సులోకి అవి ఎలా వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది.