ఐపీఎల్: ఆ జట్టుకు భారీ షాక్..స్టార్ ప్లేయర్ దూరం

A huge shock to that IPL team

0
108

ఐపీఎల్ 2021 రెండో దశ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ చివరి అంకానికి చేరుకోవడంతో ప్లే ఆఫ్స్ బెర్తు కోసం కొన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐపీఎల్ 2020 మాదిరిగానే ఈసారి కూడా లీగ్ చివరివరకు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయ్యేలా కనిపించడం లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ (18) ఇప్పటికే అధికారిక ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోగా..ఢిల్లీ క్యాపిటల్స్ (16)​ కూడా ఆ దిశగా వెళుతోంది. మరో రెండు స్థానాల కోసం హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఐదు జట్లు రెండు బెర్తుల కోసం పోటీపడుతున్నాయి.

ఇలాంటి సమయంలో పంజాబ్‌ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. వెస్టిండీస్ స్టార్‌ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్  ఐపీఎల్ నుండి తప్పుకున్నట్లు పంజాబ్‌ కింగ్స్‌ వెల్లడించింది. ఐపీఎల్‌-2లో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడిన గేల్‌..త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం కావాలని భావిస్తున్నట్లు సమాచారం.