ఆ నిర్ణయం వద్దు సచిన్ కీలక వ్యాఖ్యలు

ఆ నిర్ణయం వద్దు సచిన్ కీలక వ్యాఖ్యలు

0
119

టీ 20 ఫార్మెట్ వచ్చిన తర్వాత క్రికెట్ మజా పెరిగింది.. అయితే టెస్ట్ మజా క్రికెట్లో బాగా తగ్గింది.. ముఖ్యంగా భారత్ లో ఇదే మాట వినిపిస్తోంది, సంప్రదాయవాదులు ఇదే చెబుతున్నారు. అందుకే టెస్టు మ్యాచ్ లను అందరికి దగ్గర చేసేందుకు ఐసీసీ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ లను ప్రతిపాదిస్తోంది.

దీనిపై దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్పందించాడు. టెస్టు మ్యాచ్ నిడివిని ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించడానికి బదులు ఐసీసీ నాణ్యమైన పిచ్ ల ఏర్పాటుపై దృష్టి పెడితే మంచిదని సలహా ఇచ్చాడు. పిచ్ బాగుంటే టెస్టు మ్యాచ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వివరించాడు.

అయితే ఆట కోసం కొత్త అభిమానులని ఆకట్టుకునేందుకు ప్రతీ అంశాన్ని మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆయన.టెస్టుల్లో చివరిదైన ఐదో రోజున స్పిన్నర్లకు పిచ్ ఎంతో సహకరిస్తుందని, అలాంటి వెసులుబాటును స్పిన్నర్లకు దూరం చేయడం సబబు కాదని అన్నాడు. ఐదు రోజుల ఫార్మెట్ ఉండాలి అని దానిని మార్చకూడదు అని తెలిపారు.