ఆ క్రికెటర్ నన్ను వాడుకుని మోసం చేశాడు కేసు పెట్టిన ప్రియురాలు

ఆ క్రికెటర్ నన్ను వాడుకుని మోసం చేశాడు కేసు పెట్టిన ప్రియురాలు

0
117

క్రీడాకారులపై పెద్దగా విమర్శలు ఆరోపణలు రావు.. కాని తాజాగా ఓ లైంగిక ఆరోపణ సంచలనం అయింది, మరి ఎవరిపై అనేది చూద్దాం…పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్పై మహిళ సంచన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఎంతో సఖ్యతగా ఉన్నాడు కాని ఇప్పుడు పేరు ఫేమ్ వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు అని ఆమె మీడియా ముందుకు వచ్చింది.

తనను 10 ఏళ్లుగా మోసం చేశాడని ఆరోపించింది. తనను లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.
బాబర్ నేను స్కూల్లో స్నేహితులం. బాబర్ కష్టాల్లో ఉన్నప్పుడు నేను అతడి వెంటే ఉన్నాను. నేను ఆర్ధికంగా చాలా సాయం చేశాను అని తెలిపింది ఆమె, తనకు న్యాయం చేయాలి అని కోరింది.

2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. 2012 నుంచి అతనికి ఫేమ్ వచ్చింది. అప్పటి నుంచి నన్ను పక్కన పెట్టాడు, ఇక కేసు పెడితే నన్ను చంపుతా అని బెదిరించాడు అని తెలిపింది ఆమె. మరి ఈ విషయంలో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.