అగ్గిపెట్టి మచ్చా గేమ్ దూసుకుపోతోంది – ప్లే స్టోర్లో కొత్త రికార్డ్

Aggi Petti Maccha Game - New Record in Play Store

0
84

సోషల్ మీడియా చాలా మందిని వెలుగులోకి తీసుకువచ్చింది. అలాంటి వారిలో అగ్గిపెట్టి మచ్చా ఒకరు. అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ . ఇతనికి యూట్యూబ్ లో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఓ వీడియో వచ్చిందంటే మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఓ యాక్సిడెంట్ వల్ల అతను తీవ్ర గాయాలపాలు కావడంతో కొంత మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మచ్చ మాటలు హైలెట్ అయ్యాయి. దీంతో అతను తిట్టే తిట్లు అన్నీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇతనితో ఇంటర్వ్యూ చేసి చాలా ఛానల్స్ లక్షల వ్యూస్ కైవసం చేసుకున్నాయి. మొదట ఆప్యాయంగా నమస్తే అన్నో అంటూ పలకరిస్తాడు. ఇక రెచ్చగొడితే మాములుగా ఉండదు, ఆ డైలాగ్స్ కి బీప్ లు వాడాల్సిందే. అతనికి సోషల్ మీడియాలో లక్షలాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు.

కొన్ని టీవీ షోలలో కూడా అగ్గిపెట్టి మచ్చా ఎంట్రీ ఇచ్చి అదుర్స్ అనిపించుకున్నాడు. అయితే తాజాగా అగ్గిపెట్టి మచ్చా మరో అరుదైన ఘనత సాధించాడు. గూగుల్ ప్లే స్టోర్ లో అగ్గిపెట్టి మచ్చా గేమ్ దూసుకుపోతోంది.game on aggi petti maccha అనే ఈ గేమ్ ను గేమ్ ఆన్ మీమ్స్ అనే సంస్థ రూపొందించింది.21.6ఎంబి సైజ్ గల ఈ గేమ్ లక్షకు పైగా డౌన్ లోడ్స్ ను సొంతం చేసుకుంది. ఈ గేమ్ ని ఆడితే సేమ్ మారియో గేమ్ ఆడిన ఫీల్ వస్తుంది.నమస్తే అన్న అంటూ మచ్చా వాయిస్ వస్తుంది గేమ్ స్టార్ట్ అయిన సమయంలో. సో ఇది చాలా మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.