చివరి టెస్టులో అలిస్టర్ కుక్ సెంచరీ

చివరి టెస్టులో అలిస్టర్ కుక్ సెంచరీ

0
127

అలిస్టర్ కుక్ చివరి టెస్టులో అరుదైన మైలు రాయి సాధించాడు . ఇండియాతో జరుగుతున్న చివరి టెస్టులో కుక్ సెంచరీ కొట్టాడు. తన టెస్టు కెరీర్ లో 33 వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాత్ తోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న కుక్… చివరి టెస్టులో సెంచరీ సాధించడంతో ఎగిరి గంతేశాడు. కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ వైపు బ్యాట్ చూపుతూ ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. కుక్ సెంచరీతో కుటుంబసభ్యుల, అభిమానుల చప్పట్లతో స్టేడియం మార్మోగింది. 2006 నాగ్ పూర్ లో ఇండియాతో జరిగిన తొలి టెస్టులోనూ కుక్ (104) సెంచరీ చేశాడు. ఇలా … అరంగేట్ర టెస్ట్.. .చివరి టెస్టుల్లో సెంచరీలు బాదిన ప్లేయర్ గా అలిస్టర్ కుక్ అద్భుతమైన రికార్డ్ తన పేరిట రాసుకున్నాడు.