మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోట్లాది మందికి ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. అంతేకాదు అన్నీ రకాల లోన్స్ కూడా ఈ బ్యాంకులోనే ఎక్కువగా తీసుకుంటారు. ప్రజలకు అవసరం అయిన అన్నీ రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకు ఖాతాదారులు ఓ విషయం తెలుసుకోవాలి. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
చెక్ బుక్ లు, క్యాష్ విత్ డ్రాలకు సంబంధించి సర్వీస్ ఛార్జీలను ఎస్బీఐ వసూలు చేయబోతోంది. మరి ఆ విషయాలు ఏమిటి అనేది చూద్దాం.
1.S.B.I ఏటీఎంలతో పాటు మిగిలిన ఏటీఎంలతో నెలకు నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా మీరు డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. ఇక మరో లావా దేవీ అంటే ఐదో లావాదేవీ నుంచి 15రూపాయల చార్జీ జీఎస్టీ కూడా పడుతుంది.
2..బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత ప్రతి చెక్ కు ఛార్జి వసూలు చేస్తారు.
3. 10 చెక్కులు ఉండే చెక్ బుక్ కోసం రూ. 40తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
25 లీవ్స్ చెక్ బుక్ కు రూ. 75తో పాటు జీఎస్టీ కట్టాలి. అత్యవసరంగా చెక్ బుక్ కావాలనుకునేవారు రూ. 50తో పాటు జీఎస్టీ కట్టాలి.