మ‌రో క్రికెట‌ర్ గుడ్ బై షాక్ లో క్రీడా అభిమానులు

మ‌రో క్రికెట‌ర్ గుడ్ బై షాక్ లో క్రీడా అభిమానులు

0
106

మ‌న భార‌త క్రికెట్ నుంచి చాలా మంది గ‌త ఏడాది నుంచి రిటైర్ మెంట్ ప్ర‌క‌టిస్తున్నారు, తాజాగా భారత స్పిన్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశారు. త‌న‌కు క్రికెట్ లో స‌హ‌క‌రించిన అంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

ప్రజ్ఞాన్ ఓజా 2008లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను కు చుక్క‌లు చూపించాడు, గ‌తంలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్–5వ స్థానాన్ని కూడా సంపాదించాడు..పర్పుల్ క్యాప్ అందుకున్న మొదటి స్పిన్నర్ గా ఐపీఎల్ లో రికార్డ్ క్రియేట్ చేశాడు

ఇండియా నుంచి మొత్తం 24 టెస్టులు, 18 వన్డేలు మాత్రమే ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 113 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రజ్ఞాన్ ఓజా దాదాపు 8 ఏళ్లుగా మ్యాచుల‌కి దూరంగా ఉన్నాడు, 2012నుంచి ఇంట‌ర్ నేష‌న‌ల్ క్రికెట్ మ్యాచులు ఆడ‌లేదు…ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.
దీంతో ఆయ‌న అభిమానులు షాక్ అవుతున్నారు.