నేడు మరో ఆసక్తికర పోరు..ముంబై వర్సెస్ పంజాబ్ కింగ్స్

0
116

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ ఆసక్తికరంగా కొనసాగుతుంది. అన్ని మ్యాచులు ప్రేక్షకులను ఆనందింపచేసాయి. ఇప్పటికే  22 మ్యాచ్‌ లు పూర్తి అయిపోయి..ఇవాళ 23 మ్యాచ్ లో తలపడానికి ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ రెడీగా ఉన్నారు. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈరోజు విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

ఇరు జట్ల వివరాలు ఇలా..

ముంబై ఇండియన్స్‌: ఇషాన్ కిషన్ , రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా