నిజమే క్రీడలో ఆడినా రికార్డే ఆడకపోయినా రికార్డే , సెంచరీ చేస్తే రికార్డు డక్ అవుట్ అయితే రికార్డు,
టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీకి శతకాలు చేయడం బాగా ఇష్టం, ఆయన అభిమానులకి ఇది చాలా ఇష్టం, ఇలా ప్రతీ ఏడాది జరిగే మ్యాచుల్లో కోహ్లీ సెంచరీలు బాదుతూ ఉంటాడు, పరుగుల వర్షం కనిపిస్తుంది మైదానంలో.. కాని ఈ ఏడాది మాత్రం అందరికి బ్యాడ్ గానే నడిచింది.. విరాట్ కి కూడా బ్యాడ్ గానే నడిచింది అంటున్నారు అభిమానులు.
విరాట్ కోహ్లీ 2008లో టీమ్ఇండియాలోకి ప్రవేశించాడు. అక్కడ నుంచి చూసుకుంటూ వస్తే 2009లో 1, 2010లో 3, 2011లో 4, 2012లో 5, 2013లో 4, 2014లో 4, 2015లో 2, 2016లో 3, 2017లో 6, 2018లో 6, 2019లో 5 మొత్తంగా 43 శతకాలు బాదేశాడు. ఇలా ప్రతీ ఏడాది పరుగుల జోరు చూపించాడు.
కాని ఈ 2020 దారుణమైన ఓటమిని చూపించింది. ఇక ఈ ఏడాది మ్యాచుల్లో ఒక్క శతకం చేయలేదు
అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తం 242 మ్యాచుల్లో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.