అరవింద సామెత లో ఆ పాట సినిమాకే హైలెట్

అరవింద సామెత లో ఆ పాట సినిమాకే హైలెట్

0
111

ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సామెత ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్యం వహిస్తున్నారు,ఈ సినిమా ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ మొదటిసారి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మధ్యనే రిలీజ్ అయ్యున ఈ చిత్రం టీజర్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.

అయితే ఎప్పుడూ క్లాస్ అండ్ మెలోడీ సాంగ్స్ తో సినిమా తెరకెక్కించే త్రివిక్రమ్ తన పంధా మార్చుకొని ఈ సారి మాస్ మసాలా లాంటి ఐటెం సాంగ్ ని ఈ సినిమాలో పెట్టాడు. ఈ సాంగ్ కి ఎన్టీఆర్ డాన్స్ తో ఇరగ తీసాడని, ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇలాంటి సాంగ్ వస్తుందని ఎవరు ఊహించరని ఈ సినిమాకి పనిచేస్తున్న సాంకేతిక వర్గం మరియు నిర్మాతలు అనుకుంటున్నారు. తమన్ సంగీత పరిచిన ఈ సాంగ్ కి ఎన్టీఆర్ వేసిన డాన్స్ కూడా తోడవడంతో ఇది ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాయడం ఖాయమని నిర్మాతలు, ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇక ఈ సాంగ్ లిరికల్ వెర్షన్ వచ్చే నెల మొదటి వారం రిలీజ్ చేయనున్నట్లు తాజా సమాచారం. టీజర్ తోనే ఎన్నో రికార్డ్స్ క్రీయేట్ చేసిన ఈ చిత్రం ఈ సాంగ్ తో ఎన్ని రికార్డ్స్ క్రీయేట్ చేయబోతుందో చూద్దాం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి.