టీ20 వరల్డ్ కప్: టీమిండియాలో మార్పులు ఖాయమేనా?

Are the changes in the T20 World Cup squad permanent?

0
108

టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను ఎంపిక చేసింది. ఇప్పుడు ఇదే బీసీసీఐకి పెద్ద తలమొప్పిగా మారింది. ఆ 15 మంది సభ్యులలో సూర్యకుమారి యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ఇప్పుడు ఫామ్ లో లేరు. ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో వాళ్ళు పూర్తిగా తేలిపోయారు. దీనితో బీసీసీఐ సమాలోచనలు చేస్తుంది.

వీరికి బ్యాకప్ ప్లేయర్లుగా శ్రేయస్ ను తీసుకోవాలని చూస్తుంది. కానీ ఆ టీంలో మార్పునకు అక్టోబర్ 10 వరకు అవకాశం ఉండడంతో ఆలోగా వారు ఫామ్ లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది బీసీసీఐ. అల్ రౌండర్ గా ఎంపిక చేసిన హార్దిక్ ఇప్పుడు బౌలింగ్ చేసేలా కనిపించడం లేదు. దీనితో అతనికి బ్యాకప్ ప్లేయర్ గా శార్దూల్ ఠాకూర్ లేదా దీపక్ చాహర్ ను తీసుకోవాలని బీసీసీఐ చూస్తుంది.

శిఖ‌ర్ ధావ‌న్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌ లాంటి ప్లేయ‌ర్స్ కూడా త‌మ‌కు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టీమ్ నుంచి పిలుపు వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఎదురు చూస్తుండగా ఏం జరుగుతుందో చూడాలి. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.