కేఎల్ రాహుల్ తో పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి..

0
141

ప్రముఖ క్రికెటర్ లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్టు కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఏడాది పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే కేఎల్ రాహుల్ తో పెళ్ళి వార్తలపై అతియా శెట్టి, అతని సోదరుడు స్పందిస్తూ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇవన్నీ వుట్టి పుకార్లని ఆమె తెలిపారు. తాను  ఎవరితోనూ కలిసి తిరగడం లేదని, తన స్వగృహంలో తల్లిదండ్రుతో కలిసి ఆనందంగా జీవనం సాగిస్తున్నట్టు వెల్లడించింది.

అతని సోదరుడు కూడా వీరిద్దరికి ఎలాంటి నిశ్చితార్థం కూడా జరగలేదని స్పష్టం చేశారు. వినిపించే వార్తలన్నీ అబద్దాలేనని అహన్ కూడా మరోసారి గుర్తుచేసాడు. అంతేకాకుండా ఇప్పటివరకు ఎలాంటి పెళ్ళి ప్రస్తావన మా ఇంట్లో చేర్చించలేదని తెలిపాడు. ఇంకా కొన్ని నెలల వరకు పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆలోచన లేదని వెల్లడించాడు.