ఖమ్మం జిల్లాలో దారుణం..నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వివాహేతర సంబంధం..

0
96

అనుమానాలు, వివాహేతర సంబంధాల వల్ల ఇప్పటికే ఎంతో కాపురాలు కూలిపోయాయి. వీటివల్ల హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలానే ఉండగా..తాజాగా తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటన కారణముగా నిండు ప్రాణం బలి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే..అల్లిపురానికి చెందిన వీరబాబు భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోగా..ఈ విషయం తెలిసిన వీరబాబు భార్యను మార్వడానికి విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ వీరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పలుమార్లు నచ్చజెప్పాడు.

దాంతో అయినా ఇతని మాట వినకుండా మల్లి ప్రియుడితో కలిసి ఉండడం చేసింది. ఆ తరువాత ఒక రోజు అతని భార్య, ఆ యువకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు వీరబాబు చూసి ఆగ్రహం ఆపుకోలేక కత్తితో వారిపై దాడి చేసాడు. ఈ ఘటనలో ఆ యువకుడికి తీవ్ర గాయాలుకావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించాడు. దాంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.