యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ..7 రోజులు ఐసొలేషన్​లో ఆసీస్​ కెప్టెన్

Aussie captain in Isolation for 7 days

0
105

యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ ​ తగిలింది. కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న కారణంగా గురువారం అడిలైడ్​ వేదికగా జరగనున్న డేనైట్​ టెస్టుకు ఆసీస్​ కెప్టెన్ ప్యాట్​ కమిన్స్​ దూరమయ్యాడు.

కరోనా రిపోర్టులో అతడికి నెగిటివ్​గా తేలినా..పాజిటివ్​ వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల అతడు వారం రోజుల పాటు ఐసొలేషన్​లో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే మెల్​బోర్న్​లో జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ట్రావిస్ హెడ్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు. ఈ మ్యాచ్​తో మైఖేల్ నెసెర్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.

యాషెస్​ సిరీస్​లో భాగంగా తొలి టెస్టులో ఓటమిపాలైన ఇంగ్లాండ్​ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఎలాగైనా పైచేయి సాధించాలని చూస్తోంది. అడిలైడ్​ వేదికగా గురువారం ఈ డేనైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ప్రాక్టీస్​లో మునిగితేలాయి. తాజాగా ఈ టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్.

ఇంగ్లీష్ జట్టు:

జో రూట్(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జాస్ బట్లర్, హసీద్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్​సన్, బెన్​స్టోక్స్, క్రిస్ వోక్స్

ఆస్ట్రేలియా జట్టు:

మార్కస్ హారిస్, డేవిడ్ వార్నర్, లబుషేన్, స్మిత్, ట్రెవిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారే, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, నాథల్ లియోన్, జే రిచర్డ్​సన్.