బిగ్ బాస్ విన్నర్ అతనే ?

బిగ్ బాస్ విన్నర్ అతనే ?

0
84

గత ఆదివారం బిగ్ బాస్ నుండి బాబు గోగినేని ఎలిమినేట్ అయ్యారు. అయితే తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయన బిగ్ బాస్ షో గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే బిగ్ బాస్ షోలో బాబు గోగినేని ఎక్కువగా కౌశల్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే తాను చేసింది టార్గెట్ కాదని నిరసన తెలిపానని బాబు తెలిపారు. బిగ్ బాస్ షోలో విన్నర్ ఎవరు అవ్వొచ్చంటే… ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు బాబు.

‘‘కౌశల్ నాకు కాంపిటేషన్ అని అనుకోలేదు ఎందుకంటే నేను చివరిదాకా ఉంటానన్న కాన్ఫిడెన్స్ కానీ బర్నింగ్ డిజైర్ కానీ నాకు లేదు. నేను ష్యూర్‌గా చెప్పగలను కౌశల్ ఫైనలిస్టుల్లో ఒకడని. నాకు దానిలో ఎలాంటి అనుమానం లేదు. చూస్తుంటే ఆయనకు సపోర్ట్ కూడా అలాగే ఉంది. ఏ కారణాల వల్ల అయినా ఇంట్లో కూడా ఆయనకు సపోర్ట్ బాగా ఉన్నట్టుగా నేను బయటకు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది. మీకు అన్యాయం జరిగింది అని ఆడవారితో అంటే ‘మాకేం అన్యాయం జరిగింది?’ అన్నారు. ఆయనకు సపోర్ట్ ఉంది అనడాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రజల్లో కూడా సపోర్ట్ ఉందేమోనని ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. ఆయన్ను గెలవనివ్వండి. దట్స్ ఓకే. ఎవరో ఒకరు గెలవాలి కదా’’ అని బాబు గోగినేని చెప్పుకొచ్చారు.