పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు

Badminton queen PV Sindhu gave clarity on the wedding

0
89

టోక్యో ఒలింపిక్స్ కు క్రీడాకారులు సిద్దమవుతున్నారు.జపాన్ రాజధానిలో జరిగే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి కూడా క్రీడాకారులు సిద్దం అయ్యారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతోంది. సింధు పతకం తెస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక కొన్ని నెలలుగా ప్రపంచ బ్యాడ్మింటన్ పై ఘనమైన విజయాలు సాధించింది పీవీ సింధు. ఇక ఆమె అభిమానులు చాలా మంది మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారు. ఇక నెట్టింట దీని గురించి ఎంతో చర్చ జరుగుతోంది. తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

ఇప్పుడు అసలు పెళ్లి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు తను ఆటపైనే దృష్టి పెట్టానని వెల్లడించింది. ఒకవేళ తన పెళ్లి కుదిరితే అందరికీ చెప్పే చేసుకుంటానని వివరించింది. మొత్తానికి ఆమె ఇంటర్వ్యూ చూసిన అభిమానులు ఒలింపిక్స్ లో పతకం సాధించాలని కోరుతున్నారు