పాకిస్ధానే కాదు , పాక్ క్రికెటర్లు కూడా ఇటీవల భారత్ ని టార్గెట్ చేసుకుని పలు విమర్శలు చేస్తున్నారు, తాజాగా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ క్రికెటర్ల పర్యటనకు భారత్ అంత సురక్షితమైన ప్రదేశం కాదని అంటున్నాడు, ఇక్కడ మ్యాచులు ఆడేందుకు ఏ మాత్రం సురక్షితం కాదు అని చెబుతున్నాడు.ఐసీసీకి ఓ విషయం కూడా చెప్పాడు.. అక్కడ సరైన రక్షణ చర్యలు లేనందున ఏ మ్యాచ్ జరుగకుండా చూడాలి అని కోరాడు.
భారత్ కంటే ఇతర దేశాలు చాలా బెటరని చెబుతున్నాడు. ఆ దేశ ప్రజలు వారిలో వారే పోట్లాడుకుంటారని, కావాలంటే ఒకసారి అటువైపు చూడాలంటూ పరోక్షంగా పౌరసత్వ బిల్లుపై జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించాడు. ఈ విషయంలో ఐసీసీ తప్పకుండా చర్యలు తీసుకోవాలని మియాందాద్ కోరాడు.
అంతేకాదు తాను చెప్పిన సూచనపై ఐసీసీ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి అంటున్నాడు, అయితే చాలా మంది అసలు పాక్ లో మ్యాచ్ లు ఎక్కువగా జరుగుతాయా, ఇతర దేశాల నుంచి క్రికెటర్లు వస్తే గతంలో పాక్ లో దాడులు ఎలా జరిగాయో అందరికి తెలుసు , భారత్ లో అలాంటివి ఎప్పుడూ జరగలేదు, ఓ క్రికెటర్ అయి ఉండి ఇలా కామెంట్లు చేయడం తగదు అని భారత క్రీడా అభిమానులు విమర్శలు చేస్తున్నారు.