ఫైనల్‌లో ఇంగ్లాండ్-పాకిస్తాన్?..బెన్‌స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Ben Stokes interesting comments..these two teams in the final!

0
89

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్ల(6, 0, 6, 0, 6, 6 )తో చెలరేగి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 7 బంతులు ఎదుర్కొన్న ఆసిఫ్‌ అలీ..25 పరుగులతో అజేయంగా నిలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

ఈ క్రమంలో..ఆసిఫ్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనతో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌పై గెలుపొంది. టోర్నీలో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. తద్వారా సెమీస్‌ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఆసిఫ్‌ అలీ.. ఈ పేరును గుర్తుపెట్టుకోండి’’ అంటూ అలీ ప్రదర్శనను కొనియాడాడు. అంతేగాక… ఫైనల్‌ చేరే జట్లను కూడా అంచనా వేశాడు. ‘ఫైనల్‌లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చూడబోతున్నామా?అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు బెన్‌ స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా గత కొంతకాలంగా మానసిక సమస్యలు, చేతి వేలి గాయం కారణంగా సతమతమవుతున్న స్టోక్స్‌.. ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూపు-1లో ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా శనివారం తలపడనున్నాయి. ఇక ఇప్పటికే రెండేసి విజయాలతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గ్రూపులో ముందంజలో ఉండగా…రన్‌రేటు పరంగా మోర్గాన్‌ బృందం మెరుగ్గా ఉంది. మరోవైపు గ్రూపు-2లో పాకిస్తాన్‌ 3 విజయాలతో టాప్‌లో ఉంది.